మహిళల ఆర్థిక పరిపుష్టి సీఎం జగన్ లక్ష్యం: ఉమ్మారెడ్డి

73చూసినవారు
పొన్నూరు పట్టణం వీఎస్ఆర్ కళ్యాణమండపంలో మంగళవారం వైఎస్ఆర్ క్రాంతి పదం ఆధ్వర్యంలో గుంటూరు పార్లమెంట్ సమన్వయకర్త ఉమ్మారెడ్డి వెంకటరమణ, ఎమ్మెల్యే కిలారి రోశయ్యతో కలిసి వైయస్సార్ ఆసరా 4విడత చెక్కును డ్వాక్రా గ్రూపు సభ్యులకు పంపిణీ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళలకు ఆర్థిక పరుపుష్టి కోసం రుణమాఫీ చేస్తున్నారని ఉమ్మారెడ్డి అన్నారు. ఏపీఎం గోపి, వైకాపాశ్రేణులు, డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్