పొన్నూరు నియోజకవర్గo పరిధిలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ విగ్రహాన్ని సోమవారం తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయటం తగదని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో వైస్ ఛాన్స్లర్ రాజశేఖర్ సాయంత్రం జెసిబి సహాయంతో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది.