పెదకాకాని హైవేపై రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

549చూసినవారు
గుంటూరు జిల్లా పెదకాకాని హైవే పై సోమవారం రాత్రి రెండు వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్యాన్సర్ హాస్పిటల్ ఎదురు ఆపి ఉన్న ఆటోను విజయవాడ వెళుతున్న కారు అతివేగంగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మృతులను, క్షతగాత్రులను గుంటూరు జి జి హెచ్ కి తరలించారు. పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.