ప్రత్తిపాడు: ప్రతికుటుంబానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం: ఎమ్మెల్యే బూర్ల

63చూసినవారు
పెదనందిపాడు మండలం పెదనందిపాడు, ఉప్పలపాడు, నాగులపాడు, వరగాని గ్రామాలలో శనివారం పల్లె పండుగ కార్యక్రమంలోఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో కార్యచరణ రూపొందిస్తుందని పేర్కొన్నారు. సబ్సిడీ లోన్లతో పాటు సంక్షేమ పథకాలు జోడించి కుటుంబాల అభివృద్ధికి చేయూతనిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్