కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబరు 26న జరుగు ప్రదర్శన, సభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్. మణిలాల్ పిలుపునిచ్చారు. ఆదివారం రేపల్లె సీఐటీయూ కార్యాలయంలో కార్మిక, ప్రజాసంఘాలు ఉమ్మడి సమావేశం ఆనంతరం కరపత్రాలు ఆవిష్కరణ చేశారు. నవంబర్ 26 న బాపట్లలో జరిగే నిరసనలో కార్మిక వర్గాలు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.