అక్షర యోధుడు రామోజీకి ఘన నివాళి

66చూసినవారు
అక్షర యోధుడు రామోజీకి ఘన నివాళి
పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన అక్షర యోధుడు రామోజీరావు మరణం తీరని లోటని చెరుకుపల్లి మండల టిడిపి అధ్యక్షుడు మల్లాది రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం చెరుకుపల్లి టిడిపి కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. టిడిపి పట్టణ అధ్యక్షుడు నాగుల పున్నారావు, విస్సంశెట్టి శ్రీనివాసరావు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్