అమృతలూరుకు చెందిన ఉపాధ్యాయురాలు గుండెపోటుతో మృతి

76చూసినవారు
అమృతలూరుకు చెందిన ఉపాధ్యాయురాలు గుండెపోటుతో మృతి
మండల కేంద్రం అమృతలూరుకు చెందిన మేకల అమృత సుధారాణి (56) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో తెనాలి లోని వారి నివాసంలో మృతి చెందినట్లు భర్త కొత్తపల్లి ఉదయభాస్కర్ తెలిపారు. ఆమె తెనాలి లోని సోమ సుందర పాలెం గ్రామంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భౌతికకాయాన్ని స్వగ్రామమైన అమృతలూరు కు చేర్చారు. నేడు మధ్యాహ్నం అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్