వైకాపాను ఓడించడమే ప్రధాన లక్ష్యం : గళ్ళా మాధవి

62చూసినవారు
వైకాపాను ఓడించడమే ప్రధాన లక్ష్యం : గళ్ళా మాధవి
వైకాపాను ఓడించడమే ప్రధాన లక్ష్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ళా మాధవి అన్నారు.గుంటూరు 42వ డివిజన్ యస్.వి.యన్ కాలనీలో ఎన్నికల ప్రచారం మరియు స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలను కలుస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. జగన్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా ఉన్న రోజులు లేవని,ఈ సారి చంద్రబాబు నాయుడుకు పట్టం కట్టాలని అన్నారు. ఆనాడు చంద్రబాబు చేసిన అభివృద్దే తప్ప ఏ మంచి పని జగన్ పాలనలో జరిగింది ఏ ఒక్కటి లేదన్నారు. పెండింగ్ లో ఉన్న సమస్యలను అధికారంలోకి రాగానే తీర్చి మీ రుణం తీర్చుకుంటామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్