వేసవి విజ్ఞాన శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ అధికారి బద్రి నాయక్ కోరారు. వినుకొండ శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా ఆదివారం విద్యార్థులకు నీతి కథలు చెప్పడం, కథలు నేర్పించడం, పుస్తక ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.