’హను-మాన్’లో ఎక్కడా అసభ్యత కనిపించలేదు. ఆడవాళ్లను వక్రీకరించి చూపిస్తేనే హిట్ అవుతుందనే ఆలోచనలో ఉన్నవాళ్లకు ఇదొక చెంపదెబ్బ’’ అని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ అన్నారు. ‘హను-మాన్’ చిత్రబృందం థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రంగరాజన్ మాట్లాడుతూ సినిమా చూసి నాకు మాటలు రాలేదు. ప్రస్తుత రోజుల్లో సినిమా కీలక మాధ్యమని, సమాజానికి విలువైన చిత్రాలను అందించాలని కోరారు.