భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీ వ్యాప్తంగా 46 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 36 మంది మృతి చెందారు. 4,53,845 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 49,217 ఎకరాల్లో ఉద్యాన పంటలు నష్టపోయాయి. 3,913 కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి.