అతిభారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్

54చూసినవారు
అతిభారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్
వాయుగుండం ప్రభావం వల్ల వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు అల్లూరి, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, కోనసీమ, పార్వతీపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్