అతివేగం.. తీసింది నిండుప్రాణం

69చూసినవారు
అతివేగం.. తీసింది నిండుప్రాణం
AP: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ రోడ్డులో జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. సబ్బవరానికి చెందిన మురళీకృష్ణ, పైడివాడకు చెందిన బొబ్బరి లావణ్య(20) గురువారం రాత్రి ద్విచక్రవాహనంపై అచ్యుతాపురం నుంచి పూడిమడక తీరంవైపు వెళ్లారు. అతివేగంగా ప్రయాణిస్తుండటంతో దారి మ‌ధ్య‌లో స్పీడ్ బ్రేక‌ర్ వ‌ద్ద వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. లావణ్య తల రోడ్డును బలంగా ఢీకొనడంతో.. తీవ్ర రక్తస్రావమై ఆమె మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్