ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన కుటుంబీకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు పోసానిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీ నరసింహ కిషోర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వ హయాంలో పోసాని అనేకసార్లు పవన్‌తో పాటు, జనసేన కార్యకర్తలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో దూషించినా అప్పట్లో పోలీసులు చర్యలు తీసుకోలేదని తెలిపారు.