విజయవాడ ఎయిర్ పోర్టు-ముంబైకి ఆగస్టు 16 నుంచి ఇండిగో సర్వీసులు నడపనుంది. రోజూ సాయంత్రం 6.30కు ముంబై నుంచి విమానం బయలుదేరి రా.8.20 కి గన్నవరం చేరుకుంటుంది. రాత్రి 9 గంటలకు ఇక్కడ బయలుదేరి రాత్రి 11కు ముంబైకు చేరుకుంటుంది. ఈ సర్వీస్ వల్ల ముంబైతో పాటు గల్ఫ్, యూకే, యూఎస్ఏ వెళ్లే ప్రయాణికులకు సులభమైన కనెక్టివిటీ ఉంటుందని ఇండిగో ప్రతినిధులు తెలిపారు.