హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నుహ్ జిల్లాలో 24 గంటల పాటు ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎమ్ఎస్ సేవలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. నుహ్ జిల్లాలో జులై 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22 సాయంత్రం 6 గంటల వరకు ఇది వర్తిస్తుంది. రేపు హర్యానాలో బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర చేపట్టనున్నారు. గతంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటన వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది.