YCP హయాంలో పోలీసులు కట్టు బానిసలుగా పని చేశారని వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఆరోపించారు. 'జగన్, భారతి, అవినాష్, భాస్కర్‌రెడ్డి, శివశంకర్ నన్ను ఇబ్బంది పెట్టారు. వివేకా కేసులో రాజీపడాలని శివశంకర్ కొడుకు చైతన్య నాకు డబ్బు ఆశ చూపారు. ఆయన మాట వినలేదని జైల్లో అధికారులు నన్ను చిత్రహింసలు పెట్టారు. నాటి ఘటనలపై విచారణ చేయాలని ఎస్పీ, సీబీఐని కోరుతున్నా' అని కడప ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు చేశారు.