మాజీ సీఎం వైఎస్ జగన్‌పై రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు విలాసవంతమైన భవనాల పిచ్చి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలి ప్రాంతంలో ఉన్న పర్యాటక కేంద్రాలను కొల్లగొట్టి రుషికొండను ధ్వంసం చేసి ప్రజా ధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ భవనం కట్టాలంటే నియమ నిబంధనలు ఉంటాయన్నారు.