జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది: ప్రత్తిపాటి

78చూసినవారు
జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది: ప్రత్తిపాటి
పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుంద‌ని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పులివెందులలో అసంతృప్త కార్యకర్తలకు డబ్బు పంచారని ఆరోపించారు. జగన్‌ తన అవినీతి సొత్తుతో ఎన్నికల ఫలితాన్ని మార్చలేరని వ్యాఖ్యానించారు. టీడీపీ-జనసేన సీట్లపై ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేద‌న్నారు. పోటీ చేసే సీట్లపై చంద్రబాబు, పవన్‌ త్వరలో స్పష్టత ఇస్తారని తెలిపారు.