BJPకి వ్యతిరేకంగా వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. వర్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు YCP స్పష్టం చేసింది. జగన్ CMగా ఉన్నప్పుడు కేంద్రం తెచ్చిన రైతు చట్టాలతో పాటు CAA, NRC బిల్లులను వైసీపీ సపోర్ట్ చేసింది. ఇప్పుడు BJPకి చంద్రబాబు, పవన్ అనుకూలంగా ఉండటంతో తామూ అటువైపుగా వెళ్తే రాజకీయంగా నష్టపోతామన్న భావనతో జగన్ ఉన్నట్లు సమాచారం. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమివైపు వెళ్తున్నారని తెలిసింది.