అరటి రైతులను పరామర్శించిన జగన్

AP: రాష్ట్రంలో కురిసిన ఆకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలుగజేశాయి. ఈ నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులను మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. వైయస్ఆర్ జిల్లా తాతిరెడ్డిపల్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా నేలకొరిగిన అరటి పంటలను పరిలించారు. అనంతరం అరటి రైతులను పరామర్శించి, వారికి దైర్యం చెప్పారు.