జనసేన సభ్యత్వ నమోదు ప్రారంభం

85చూసినవారు
జనసేన సభ్యత్వ నమోదు ప్రారంభం
AP : పార్టీ సభ్యత్వ నమోదు అంటే ఎమోషన్‌తో కూడుకున్నదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంకు ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం నాదెండ్ల మాట్లాడుతూ .. ప్రస్తుతం 6లక్షల సభ్యత్వాలు ఉన్నాయని, ఈసారి 10లక్షలు దాటాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28వ తేది వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. తాము సభ్యత్వంతో పాటు రూ.5లక్షల బీమా ఇస్తున్నామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్