తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఏపీ పోలీస్ శాఖ స్పందించింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అదనంగా కల్పించిన భద్రతను మాత్రమే తగ్గించామని వెల్లడించింది. ప్రస్తుతం మాజీ సీఎం హోదాలో నిబంధనల ప్రకారం జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించామని తెలిపింది. చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఎంత భద్రత కల్పించామో ఇప్పుడు జగన్‌కు అలాగే ఇచ్చామని పేర్కొంది.