మహిళలపై దాడి దుర్మార్గం

51చూసినవారు
బద్వేలు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లెలో ప్రభుత్వానికి చెందిన రెండెకరాల డీకేటీ స్థలంలో దళితులు, పేదలు గుడిసెలు వేసుకుని ఉంటే స్థానిక నాయకుడు వచ్చి ఇళ్లను తొలగించి మహిళలపై దాడి చేయడం దుర్మార్గమని అఖిలపక్ష నాయకులు కిశోర్ కుమార్, బి. నారాయణ, సత్తార్లు మండిపడ్డారు. కడప ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆదివారం వారు మాట్లాడుతూ దళితులను, పేదలను కొట్టి, తిరిగి వారిపైనే అక్రమ కేసులు బనాయించడం ఏంటని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్