బి. కోడూరు మండలంలో నిర్వహించిన 4 నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని టీడీపీ మండల అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి పేర్కొన్నారు. బి. కోడూరు మండలంలో శనివారం 4 నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో గోవిందపల్లె నీటి సంఘం అధ్యక్షులుగా వెంగళ శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మద్దిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమపై నమ్మకంతో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.