జమ్మలమడుగులో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) వద్ద మూడో రోజు గురువారం పోలీసులు భారీగా మోహరించారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య నెలకొన్న వివాదం మూడో రోజు కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెల్లవారు జామున 5 గంటల నుంచే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి వారికి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే.