వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిపించండి: భూపేశ్

598చూసినవారు
వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిపించండి: భూపేశ్
జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు నందు బుధవారం కడప పార్లమెంటు కూటమి అభ్యర్థి భూపేశ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలువురుకి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భూపేశ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, క్లస్టర్ ఇన్ ఛార్జ్ బాల పుల్లారెడ్డి, బిజేపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్