ఎన్డీఏ కూటమిలో నూతనంగా కేంద్ర మంత్రులుగా ఎన్నికైన కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ లను సోమవారం ఢిల్లీలో జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నవయసులోనే కేంద్ర మంత్రులుగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.