ముద్దనూరు: ఉప్పలూరు భవానీ శంకర స్వామికి భక్తుల పూజలు

72చూసినవారు
కార్తీక మాసం మూడవ సోమవారం సాయంత్రం ముద్దనూరు మండలం ఉప్పలూరు గ్రామంలోని శ్రీ భవానీ శంకరస్వామి దేవస్థానం భక్తులతో రద్దీగా మారింది. స్వామివారికి అర్చకులు శ్రీనివాస మూర్తి ప్రత్యేక పూజలు, పాలు, నెయ్యి, అభిషేకాలు నిర్వహించారు. శివ నామస్మరణలతో ఆలయం మార్మోగుతుంది. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామికి కాయ కర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులందరికి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్