డిప్యూటీ మేయర్‌ డివిజన్ లో దాహం కేకలు

85చూసినవారు
డిప్యూటీ మేయర్‌ డివిజన్ లో దాహం కేకలు
కడప కార్పొరేషన్‌ పరిధిలోని 18వ డివిజన్‌లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ టిడిపి నాయకులు ధర్నా నిర్వహించారు. సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. టీడీపీ కడప కార్పొరేషన్‌ క్లస్టర్‌ ఇన్‌ఛార్జి జి. మోహన్‌ బాబు, టీడీపీ నాయకులు మాట్లాడుతూ డిప్యూటీ మేయర్‌ బండి నిత్యానంద రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న 18వ డివిజన్‌ ప్రాంతాలలో దాహం కేకలు మిన్నంటుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్