బండలాగుడు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

582చూసినవారు
బ్రహ్మంగారిమఠం మండలంలోని సిద్దయ్య గారిమఠంలో పెద్ద పీరయ్య స్వామి ఆరాధన ఉత్సవాలు రెండు రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటుచేసిన బండలాగుడు పోటీలలో ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాం రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ పోటీలలో అఖండ సినిమాలో కనువిందు చేసిన ఎద్దులు పాల్గొని తమ ప్రతిభను చాటాయి. ఈ కార్యక్రమంలో బ్రహ్మంగారిమఠం జడ్పిటిసి, ఎంపిటిసి, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్