బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో మంగళవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి పరీక్షలను నిర్వహించారు. సమాజంలో మూఢనమ్మకాలను నిర్మూలించడమే జన విజ్ఞాన వేదిక ప్రధాన ఆశయమని వక్తలు పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో మొదటి విజేతలు వరుణ్ హై స్కూల్ విద్యార్థులు, రెండవ విజేతలు దీప్తి హై స్కూల్ విద్యార్థులు, మూడవ విజేతలు గురుకుల పాఠశాల న్యూ స్కూల్ విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.