మైదుకూరు పట్టణంలోని యెర్ర చెరువుకు దాదాపు 6 సంవత్సరాల తర్వాత నీళ్లు వచ్చి చెరువు నిండటం జరిగింది. ఈ సందర్బంగా శుక్రవారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కృష్ణా జలాలకు పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎర్ర చెరువుకు నీరు రావడం సంతోషదాయకమన్నారు. నీరు రావటానికి కృషి చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ కి మైదుకూరు మున్సిపాలిటీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.