ప్రొద్దుటూరులో కౌన్సిల్ సమావేశం శనివారం రసాభాసగా సాగింది. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదంతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పేదలకు పంచాల్సిన ఇళ్లను గత ప్రభుత్వం కూల్చివేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీవో ఇవ్వడంతోనే అక్కడ తొలగింపు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యేతో వాదనకు దిగిన వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి వాదనకు దిగారు.