వైసీపీ పద్మశాలి రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రొద్దుటూరు చెందిన జింక విజయలక్ష్మిని పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం నియమించారు. జింకా విజయలక్ష్మి గతంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్ మెన్ గా బాధ్యతలు చేపట్టారు. సాధారణ ఎన్నికలలో
వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను నియమిస్తూ వైసీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.