
భూకంపం ధాటికి 3,600కు చేరిన మృతుల సంఖ్య
మయన్మార్లో ఇటీవల భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు 3,600 మందికిపైగా మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. భవనాలు కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం రెస్క్యూటీమ్లు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. భూకంప ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తుండగా, తాజా వర్షాలు, ఈదురుగాలులు సహాయక చర్యలకు అడ్డంకిగా మారాయి.