సంజీవరాయనికి ప్రత్యేక పూజలు

76చూసినవారు
సంజీవరాయనికి ప్రత్యేక పూజలు
ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంకు ఎదురుగా ఉన్న సంజీవరాయనికి టిటిడి అధికారులు మంగళవారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. వారు స్వామివారికి పట్టు వస్త్రాలు, గజమాలలు సమర్పించారు. అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. స్వామివారిని సుందరంగా అలంకరించి దర్శనార్థం భక్తులను అనుమతింపజేశారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్