ఎమ్మెల్యేగా గెలిపించండి
రామాపురం మండలం రాచపల్లె గ్రామం గంగనేరులో రాయచోటి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గురువారం పర్యటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాయచోటి అభివృద్ధికి ఎనలేని కృషి చేశానన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే తనను మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు.