చిన్నమండెం మండలం వండాడి గ్రామం లో హరిజనవాడ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వండాడి వెంకటరమణ (38) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు రాయచోటిలో పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి వస్తున్నాడన్నారు. ఎదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొందన్నారు. గాయపడ్డ వ్యక్తిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.