ఆపరేషన్ వికటించి మహిళ మృతి

69చూసినవారు
ఆపరేషన్ వికటించి మహిళ మృతి
రాయచోటి పట్టణ పరిధిలోని భరత్ మల్టీ స్పెషలిటీ ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి మంగళవారం ఉదయం అనసూయ అనే మహిళ మృతి చెందింది. బంధువుల వివరాల మేరకు చిన్నమండెం మండలం బెస్తపల్లికి చెందిన అనసూయ ఆపరేషన్ కోసం భరత్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆపరేషన్ వికటించడంతో ఇతర హాస్పిటల్కు రెఫర్ చేశారు. మృతురాలి కొడుకు వారి బంధువులు డాక్టర్ను సంప్రదించగా వెంటనే హాస్పిటల్ సిబ్బంది పోలీసులతో బయటికి వెళ్ళగొట్టారు.

సంబంధిత పోస్ట్