తుఫాన్ కారణంగా అన్నమయ్య జిల్లాలో అత్యధికంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మంగళవారం అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల వల్ల తప్పనిసరిగా అన్ని పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించాలని ఆయన ఆదేశించారు.