సంబేపల్లి మోడల్ స్కూల్ కు ఇకనైనా మోక్షం లభించేనా?

69చూసినవారు
సంబేపల్లి మండలం మోటకట్ల గ్రామం వద్ద గత టిడిపి ప్రభుత్వంలో ఏపీ మోడల్ స్కూల్ మంజూరు అయింది. పనులు మొదలుపెట్టి పునాదులు వద్ద పనులను నిలిపివేశారు. కొద్ది రోజులు సంబేపల్లి హై స్కూల్ లో మోడల్ స్కూల్ నడిపారు. మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ రాయుడు ఆర్థిక సహాయంతో రేకుల షెడ్లు వేశారు. ఇకనైనా ప్రభుత్వ పక్కా భవనాలు నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్