అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, నీటిపారుదల శాఖ ప్రభుత్వ సలహాదారుడు ఎం. వెంకటేశ్వరరావును గురువారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కలిశారు. ఏలేరు వరద ముంపు నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. వరదలు వచ్చిన తీరు, ప్రజల ఇబ్బందుల డాక్యుమెంటరీని వారికి చూపించి జగ్గంపేట నియోజకవర్గ రైతాంగాన్ని కాపాడాలని కోరారు.