రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసు కొచ్చి మళ్లీ అధికారంలోకి తేవాలని కాంగ్రెస్ నాయకులురాజారపు మహేష్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రంగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అరాచకాలు, దౌర్జన్యాలు, కేసులు ఎక్కు వగా పెరిగాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలకన్నా గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసిందన్నారు.