రౌతులపూడి మండలం ములగపూడి గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి చేరాయి. ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు సమక్షంలో వీరు టీడీపీనీ వీడి వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికి సుబ్బారావు వైసిపి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.