అమలాపురం మండల వ్యాప్తంగా గురువారం స్వాతంత్ర్య1 దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమలాపురంలోని మార్కెట్ యార్డ్, బాలిక ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.