పంట కాలువలకు సాగు నీరు అందక రైతులు ఇబ్బందులు

76చూసినవారు
పి. గన్నవరం ప్రధాన పంట కాలువకు సాగునీరు విడుదల చేసి పది రోజులు కావస్తున్న మామిడికుదురు మండలంలోని ప్రధాన పంట కాలువలకు ఇప్పటి వరకు సాగునీరు అందలేదని రైతులు అంటున్నారు. జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు జూన్ 1వ తేదీన ధవలేశ్వరం వద్ద ఇరిగేషన్ అధికారి సాగునీరు విడుదల చేశారు. వాతావరణం అనుకూలించి వర్షాలు పడటంతో సార్వా సాగుకు సిద్ధమైన రైతులకు ఇప్పటికే సాగునీరు అందకపోవడంతో పంట ఆలస్యం అవుతుందని రైతులు అంటున్నారు.

ట్యాగ్స్ :