కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే

53చూసినవారు
కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే
పి. గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో గురువారం నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి టీడీపీ అధినేత నార చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు లాంఛనమే కూటమే గెలుస్తుందని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని స్పష్టం చేశారు. ఈ సభకు టీడీపీ, జనసేన, బిజెపి నుండి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్