రావులపాలెంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం

78చూసినవారు
రావులపాలెంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం
రావులపాలెంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం, పర్యాటక ప్రదేశాలు అవగాహన కార్యక్రమం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఛైర్మెన్ ఏ. దినేష్ బాబు మాట్లాడుతూ.. ప్రపంచ పర్యాటక దినోత్సవం 1980 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న నిర్వహించబడుతోంది అన్నారు. రోజురోజుకూ ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతోంది అన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏం. గంగాధరరావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్