జక్కంపూడి రామ్మోహనరావు జయంతి సందర్భంగా మంగళవారం మండపేట కామత్ ఆర్కేడ్ లో వైకాపా రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు జక్కంపూడి రామ్మోహనరావు చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జక్కంపూడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన మంత్రిగా పనిచేసి రాష్ట్రానికి అనేక సేవలు అందించారన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.